జున్ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఆవులు, గేదెలు ఈనిన తర్వాత వారం రోజుల పాటు సహజ సిద్ధంగా దొరికే జున్ను చిన్నా పెద్ద అందరూ తినవచ్చు.
జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
జున్ను లో ఉండే ప్రోటీన్స్, క్యాలరీస్, పోషకాలు ఉండి శరీరాన్ని దృఢంగా ఉంచేలా చేస్తాయి.
నిద్రలేమి సమస్య బాధిస్తే జున్ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జున్ను పాల‌లో సాధార‌ణ పాల క‌న్నా కాల్షియం ఎక్కువ‌గా ఉండి ఎముక‌లు దృఢంగా, బ‌లంగా ఉంటాయి.
మలబద్దకం, మధుమేహ వంటి సమస్యలు ఉన్నవారు జున్ను మంచి ఆహారం.
జున్ను పాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.
అలాగే దీనిని తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
అలా అని ఎక్కువగా జున్నును తింటే కడుపు నొప్పి, కఫం, వాతం వంటివి వస్తాయి.