జుంబాతో ఎన్ని అదిరిపోయే ఫిట్నెస్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..?

నేటి జనరేషన్ తీసుకునే ఆహారం వల్ల ఉబకాయం పెరిగిపోవడంతోపాటు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలాంటి వారికి జుంబా డ్యాన్స్ చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు
12వారాల పాటు రోజు జుంబా డ్యాన్స్ చేయిస్తే వారిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వైద్యుల పరిశోధనలో తేలింది.
ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 30నిమిషాల పాటు జుంబా చేస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చని సర్వేలు చెబుతున్నాయి.
కార్డియోవాస్కులర్ (గుండె ఆరోగ్యం)కి జుంబా దోహదపడుతుంది. ఈ డ్యాన్స్ వల్ల హృదయం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ డ్యాన్స్‌లో శరీరభాగాలన్నీ కదులుతాయి. దీంతో కండరాలు దృఢంగా మారి కండరాల సామర్థ్యం పెరిగి చురుకుగా మారుతారు.
ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను అధిగమించేలా చేస్తుంది.
రెగ్యులర్‌గా ఈ డ్యాన్స్ చేయడం వల్ల వయో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఒత్తిడి దూరం అవుతుంది. గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఈ డ్యాన్స్ గ్రూప్ లేదా ఒంటరిగా చేయవచ్చు. యూట్యూబ్‌లో జుంబా డ్యాన్స్ సాంగ్స్, క్లాసులు అందుబాటులో ఉంటాయి. ఒకసారి టై చేయండి.