టీ, కాఫీలతో పాటు సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా కొంత మంది సిగరేట్స్ తాగే అలవాటును మానుకోలేక పోతున్నారు.
అయితే కొంత మంది సిగరెట్స్‌ను టీ, కాఫీలను తాగేటప్పుడు లేదా తాగిన తర్వాత సిగరెట్ తాగుతారు. అయితే అలా చేయడం ఎంత ప్రమాదకరమైన అలవాటో ఇక్కడ తెలుసుకుందాం.
ధూమపానాన్ని తాగుతూ టీని ఆస్వాదించాలనుకుంటారు. ఒక చెత్తో గ్లాస్ పట్టుకుని మరో చేతితో సిగరెట్ లాగిస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అలాగే సిగరెట్, టీ, కాఫీలు ఒకేసారి తాగినప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది.
మీరు టీ లేదా కాఫీతో సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నట్లయితే, వీటిలో ఉండే కెఫిన్ ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుంది.
సిగరెట్ తాగేవారు ఎక్కువగా టీ తాగే అలవాటు కూడా ఉంటుంది. వీటిని ఎక్కువగా శరీరంలోకి పంపించడం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది.
సిగరెట్ నుంచి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఉంటుంది. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది.
అలాగే కాఫీ, టీలతో పొగ తాగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి టీ, కాఫీలతో పాటు సిగరెట్‌ను తాగే అలవాటును మానుకోవాలి. అలాగే ధూమపానం కు ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.