ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు పడిపోయారు. వాటిని టమాటా కెచప్‌తో కలిపి తింటుంటారు.
ముఖ్యంగా సమోసా, కర్రీ పఫ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి వాటిని టమాటా కెచప్ లేకుండా తినరు. కానీ, అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
టమాటా కెచప్‌ను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
అలాగే ఇందులో హిస్టామిన్ రసాయనం అధిక మోతాదులో ఉన్నందున అలర్జీలు వస్తాయి.
టమాటా కెచప్‌లో ఉండే టర్పైన్ మూలకం శరీర దుర్వాసనకు దోహదపడుతుంది.
ఇంజేక్షన్లతో లేదా రసాయనాలతో పండించిన టమాటాలతో కెచప్‌ను తయారు చేస్తారు. కాబట్టి దీనిని ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
టమాటా కెచప్‌లో యాసిడ్ కలిగి ఉండి ఎసీడిటీ వస్తుంది.