ప్లాస్టిక్ స్ట్రా తో పానీయాలు సేవిస్తే ఎంత ప్రమాదమో తెలుసా?

వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. ఈ పానీయాలను సేవించేటప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ స్ట్రా ఉపయోగిస్తారు.
అయితే దీన్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్ట్రాతో డ్రింక్ తాగినప్పుడు దంతాల మధ్య నోటికి పేరుకుపోయిన క్రిములు శరీరంలోకి వెళ్లి పలు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
అలాగే స్ట్రా ఎక్కువగా ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
స్ట్రాతో ఏదైనా పానీయం తాగడం వల్ల ముఖ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది ముఖంపై ముడతలను పెంచుతుంది.
దీనిని వాడితే దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతిని టీత్‌పై ప్రభావం పడుతోంది.
ప్లాస్టిక్ స్ట్రా లతో మీరు జ్యూస్ లేదా కోల్డ్ కాఫీ తాగుతుంటారు. దీని వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి జ్యూసులు లేదా ఇతర పానీయాలు తాగేటప్పుడు ప్లాస్టిక్ స్ట్రా ఉపయోగించకుండా గ్లాస్‌తోనే సేవించడం మంచిది.