ప్రస్తుతం ఉన్న టెన్షన్స్‌లో చాలా మంది టీతో కాసేపు ఉపశమనం పొందాలనుకుంటారు. దీంతో పాటు రస్క్‌ను కలిపి చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటుంటారు.

అయితే టీతో పాటు రస్క్‌ను తినడం వల్ల ప్రమాదకర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీలో రస్క్‌ను ముంచుకుని తింటే ఆహార కోరికలు పెరిగి రకరకాల పదార్థాలు తినాలని అనిపిస్తుంది. అలాగే బరువు తొందరగా పెరిగేలా చేస్తుంది.
ఇందులో ఎలాంటి పోషకాలు లేనందున ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి రసాయనాలు జోడించబడతాయి. వాటిని మీరు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.
రస్క్ చక్కెర, రిఫైన్డ్ ఆయిల్, మైదా, గ్లూటెన్ మిశ్రమం నుండి తయారవుతుంది. ఇందులో ఉపయోగించే వస్తువుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహ ప్రమాదం పెరిగే అవకాశం ఎక్కువ.
ఇది మీ పేగులో బ్యాక్టీరియాను పెంచుతాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
టీ, రస్క్ ప్రతి రోజూ తింటే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీతో దీనిని తినకుండా బ్రెడ్‌ను తినడం మంచిది.