పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ చెట్లను పెంచాల్సిందే?

వర్షాకాలం వచ్చిందంటే చల్లదనానికి పాములు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతుంటాయి. అలాగే ఒక్కోసారి ఇంట్లోకి కూడా రావడంతో ప్రమాదానికి గురవుతుంటారు.
పాములు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఈ చెట్లను ఇంటి పరిసరాల్లో పెంచుకుంటే మంచిదట. వాటి వాసనకే పాములు పారిపోతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇందులో ముఖ్యమైనది సర్పగంధ మొక్క. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల దాటి ఘాటు వాసనకు పాములు పారిపోతాయి.
అలాగే మూగ్‌వర్ట్ అనే మొక్క పల్లె టూరులో చాలానే ఉంటాయి. వాటి వాసనకు పాములు దీని దగ్గరికి కూడా రావు.
వెల్లుల్లి తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయి. దీని మొక్కలో సల్ఫరిక్ యాసిడ్ పాములకు నచ్చదట. కాబట్టి వెల్లుల్లిలో ఉప్పు కలిపి కిటికీల దగ్గర ఉంచడం మంచిది.
చాలా మంది లెమన్ గ్రాస్‌ను టీలో ఉపయోగిస్తుంటారు. దీనిని ఇంట్లో పెంచుకుంటే పాములు దోమలు దూరంగా ఉంటాయి.
పాములను తరిమికొట్టేందుకు ఉల్లి కాడలు కూడా సహాయపడతాయి. అలా అని అజాగ్రత్తగా ఉండకూడదు. చెట్ల దగ్గర శుభ్రం చేస్తూ ఉండాలి.