ఇంట్లో బల్లులు ఉన్నాయా.. అయితే ఈ టిప్స్‌ పాటించి తరిమికొట్టండిలా?

చాలా మంది ఇంట్లో గోడలపై బల్లులు విసిగిస్తుంటాయి. వాటిని చూసి భయపడుతూ ఏ పని చేయలేరు.
అయితే మీ ఇంట్లో బల్లులు పారిపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించి వాటిని తరిమికొట్టవచ్చు.
ఉల్లి పాయలను ముక్కలుగా కట్ చేసి కిటికీల మూలలలో పెట్టాలి. లేదా ఉల్లి రసాన్ని గోడలపై స్ర్పే చేసిన బల్లులు రావు.
బిర్యానీ ఆకులను నిప్పుల్లో వేసి ఉంచితే పొగ వాసనకు బల్లులు పారిపోతాయి.
గోడలపై బల్లులు కనిపిస్తే చల్లటి నీటిని తీసుకుని చల్లాలి. అవి వెంటనే కింద పడిపోతాయి. అప్పుడు వాటిని తీసి బయట పడేయవచ్చు.
ఘాటైన కర్పూరం వాసనికి కూడా బల్లులు పోతాయి. కాబట్టి ఈ చిట్కాలను పాటించి బల్లులను తరిమికొట్టండి.
ఇంట్లో టూబ్‌లైట్లు వేసి ఉండటం వల్ల అవి వేడి కోసం వాటి కింద దాక్కొని ఉంటాయి. లైట్స్ ఆఫ్ చేస్తే అవి బయటకు వెళ్లిపోతాయి కాబట్టి ఆఫ్ చేయడం మంచిది.