స్నానం చేసేటప్పుడు సబ్బును డైరెక్ట్‌గా స్కిన్‌కి అప్లే చేస్తున్నారా..? అయితే డేంజర్‌లో పడినట్లే

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతీ రోజూ రెండు, మూడు సార్లు స్నానం చేస్తుంటారు.
అయితే.. స్నానం చేసే క్రమంలో శరీరానికి సబ్బును ఎలా పడితే అలా ఉపయోగిస్తుంటారు. దీని కారణంగా చర్మం దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
సబ్బును శరీరంపై నేరుగా ఉపయోగించే కంటే.. మార్కెట్‌లో లభించే మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలట. ఇలా చేయడం వల్ల సబ్బు ప్రభావం నేరుగా చర్మంపై పడకుండా ఉంటుందట.
అయితే... చాలా మంది సబ్బును పై నుంచి కిందకి రుద్దుతారు. కానీ, నిజానికి సబ్బును కింద నుంచి పైకి రుద్దాలట.
చాలా మంది ఎక్కువ నురుగు వచ్చే వరకు శరీరంపై రుద్దుతూనే ఉంటారు. అలా చేయడం చాలా ప్రమాదం. సబ్బు నుంచి వచ్చే అధిక నురుగు శరీరానికి హాని కలిగిస్తుంది.
అలాగే తక్కువ రసాయనాలు కలిగిన తేలికపాటి సబ్బును ఉపయోగించడం వల్ల సున్నితమైన చర్మానికి హాని కలుగకుండా ఉంటుంది.
ముఖ్యంగా సబ్బును ఉపయోగించిన తర్వాత.. దానికి ఆరబెట్టాలి. లేదంటే సబ్బు అంతా తడిగా ఉండి అది తేమగా మారి దానిపై క్రిములు ఏర్పడతాయి.
మీ ముఖానికి సబ్బు పడనట్లయితే.. సహజమైన ఫేస్ వాష్‌ని ఉపయోగించడం మంచిది.
నోట్: పైన తెలిపిన వివరాలు ఇంటర్‌నెట్ సహాయంతో తెలియజేసినవి మాత్రమే. మీ స్కిన్‌కు ఎలాంటి ప్రాబ్లెం వచ్చిన వైద్యుడిని సంప్రదించడం మంచిది.