పీడ కలలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

పీడ కలలు సాధారణంగా అందరికీ వస్తుంటాయి.
దెయ్యాలు వెంటబడటం, భవనాల నుంచి కింద పడిపోవడం, ఎక్కడో చిక్కుకుపోవడం, ఇష్టమైన వ్యక్తులు మరణించడం వంటి కలలు పడుతుంటాయి.
పీడకలల మనకు భయాన్ని కలిగించడమే కాకుండా రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తాయి.
కంటి నిండ నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతారు.
దీంతో కొంతమంది ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు.
అయితే కొన్ని ఆహారాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవెంటో చూద్దాం..
రాత్రి పడుకునే ముందు ఒక కప్ చామంతి టీ లేదా లావెండర్ టీ తాగితే ప్రశాంతగా నిద్రపోవచ్చు.
పాలు, పెరుగు, జున్ను కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే పీడకలలు రాకుండా ఉంటాయి.
అలాగే బచ్చలికూర, క్యాలీ ఫ్లవర్ ఆకుకూరలు కూడా పీడకలల సమస్యను దూరం చేస్తాయి.
ట్రిప్టోపాన్ ఎక్కువగా ఉండే చేపలు, గుడ్లు, కాయలు, మొలకెత్తిన విత్తనాలు, సీఫుడ్ మంచి నిద్రకు ఎంతగానో సహాయపడుతుంది.
రాత్రి భోజనంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే రొట్టె, బ్రౌన్‌రైస్, చిలగడ దుంపలు లాంటి పిండి పదార్థాలు తీసుకోండి.
విటమిన్ బి6 అధికంగా ఉండే అరటిపండ్లు, కాయలు, పౌల్ట్రీ, తృణధాన్యాలు తింటే మీరు ప్రశాంతంగా ఏ పీడకల రాకుండా నిద్రించొచ్చు.
ఈ చిట్కాలను పాటించి మీ పీడకలలకు చెక్ పెట్టండి. ప్రశాంతంగా నిద్రపోండి.