పాములు నిజంగానే నాగ స్వరానికి డ్యాన్సులు చేస్తాయా.. అసలు విషయం ఇదే..

పాములు అంటే తెలియని వారుండరు. అయితే వాటిని చూసి చాలా మంది భయపడతారు.
మరికొందరు మాత్రం వాటి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అలా ఇష్టపడే వారి కోసమే ఈ స్టోరీ.
సాధారణంగా మనం సినిమాల్లో పాములు నాగస్వరం వస్తే అవి లయబద్దంగా నాట్యం చేయడం చూస్తుంటాం.
మరి అవి నిజంగానే పాములు డ్యాన్స్ చేస్తాయా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే దీనిపై నిపుణులు షాకింగ్ విషయాలను తెలియజేశారు.
అసలు పాములు నాగస్వరానికి డ్యాన్స్ చేయలేవంటూ తేల్చిచెప్పారు. ఎందుకంటే పాములు నాగస్వరం వినలేవంట. వీటికి బాహ్య చెవులు, కర్ణభేరి ఉండవంటూ పేర్కొన్నారు.
స్నేక్ లోపలి చెవి చర్మానికి అనుసంధానమై ఉండటం వలన అవి భూమి మీద వచ్చే కంపనాలను కర్ణస్థంచిక గ్రహించి ఆ తరంగాలను పాము లోపలి చెవికి అందవేస్తుందట.
అయితే పాము శబ్దానికి అనుగుణంగా నాట్యం ఎలా చేస్తుందంటే.. పాముకు ముందే నాగస్వరం ఊదే వ్యక్తి ముందే సిగ్నల్స్ ఇస్తాడట.
పాము బుట్టమీద కొట్టడంతో అది భయంతో లేచి పడగ విప్పుతుంది. ఇక అప్పుడే బూరను ఊదే వ్యక్తి బూరను కదిలిస్తూ ఉంటాడు.
దీంతో ఆ పాము బూరను కాటువేయడానికి బూర చుట్టూ తిరుగుతుందట. అదే మనం డ్యాన్స్ అనే భ్రమలో ఉన్నామట.