ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పాలకూర తింటే ఎంత ప్రమాదమో?

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా పాలకూరను చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పాలకూరను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు పాలకూర తినడం వల్ల ఇందులోని కాల్షియం ఈ సమస్యను మరింత పెంచుతుంది.
అంతేకాకుండా పిత్తాశయంలో రాళ్లు ఉండటం వల్ల ఆపరేషన్ ద్వారా గాల్ బ్లాడర్‌లోని రాళ్లను తొలగిస్తారు. ఇలాంటి పెషంట్స్ కూడా పాలకూరను తీసుకోకూడదు.
జీర్ణశక్తి తక్కువగా ఉండి బాధపడేవారు, కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడే వారు కూడా పాలకూర తినకూడదు.
పాలకూరలో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని ఎక్కువగా తింటే మలబద్ధకం పెరుగుతుంది.
కీళ్ల నొప్పులు, వాపులు, మంటలతో బాధపడేవారు కూడా పాలకూరను మోతాదులో తీసుకోవాలి.
కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణులను సంప్రదించి పాలకూరను తినడం మంచిది.