పాలపై చాలామందికి అనేక రకాలైన అపోహాలు, భయాలున్నాయి. ముఖ్యంగా ప్యాకెట్ల రూపంలో లభించే పాలపై బోలేడు సందేహాలున్నాయి.

పాలు సంపూర్ణ ఆహారం. ఇందులో చక్కెర, ప్రొటీన్, శరీరానికి కావాల్సిన కొవ్వులన్నీ లభిస్తాయి.
చిన్నప్పటినుంచి పాలు తాగడం అలవాటు చేసుకుంటే మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.
ఆవుపాలలో కంటే గేదె పాలలో ప్రోటిన్స్ అధికంగా ఉంటాయి. రెండూ తేలికగానే జీర్ణం అవుతాయి.
ఘన పదార్థం రూపంలో ఫుడ్ తీసుకోలేనివారికి పాలు, పెరుగు, మజ్జిగ ఎంతో మేలు.
ప్యాకెట్ పాలు ఆరోగ్యానికి మంచిది కాదనేది పూర్తి అవాస్తవం. ప్యాకెట్ పాలలో పోషకాలేమీ తగ్గిపోవు. ఆరోగ్యానికి సురక్షితమే
డెయిరిల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి, కోవ్వు శాతం సమానంగా ఉండేలా చూస్తారు.
పాలను కొద్దిసేపు అధిక ఉష్ణోగ్రతకు గురిచేసి, వెంటనే చల్లబరుస్తారు. అందులో ఉండే బ్యాక్టీరియా నశించిపోతుంది.
అలాగే శారీరక శ్రమ లేనివాళ్లు పాలు, పెరుగు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. లేదంటూ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.
జలుబు, జ్వరం వచ్చినపుడు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరానికి మరింత బలం చేకూరుతుంది
పాలు తాగడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అపోహాలు నమ్మి పాలలో ఉండే పోషకాలను మిస్ చేసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు.