బీరువాలో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు.. అంతా అరిష్టమే ఎంత సంపాదించిన డబ్బులు నిలవవు

మనిషి జీవితంలో డబ్బుకున్న విలువ మరి దేనికి ఉండదు.
అలాంటి డబ్బును నిల్వ చేసుకునే బీరువా.. ఎటువైపు ఉంచాలి.. అందులో ఏమేమి పెట్టాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం
ఇంటి నిర్మాణంలో వాస్త్రు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నట్లే.. బీరువా వంటి విషయాల్లో కూడా వాస్త్రు శాస్త్రం ఉంటుంది.
చాలా మంది కొత్త బట్టలు, ఇష్టమైన దుస్తులు మొత్తం అన్నీ కూడా బీరువాలో కుక్కి మరీ పెట్టేస్తారు.
అంతగా ముఖ్యం కాదు అనుకుంటే పత్రాలను, డబ్బును ఎక్కడ పడితే అక్కడ అలమరాలో సద్ధేస్తుంటారు. అలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవ ఉండదు జాగ్రత్త
బీరువాలో పత్రాలను, బంగారం, డబ్బును చాలా భద్రంగా దాచుకోవాలట. ధనానికి చిహ్నంగా ఉండే వాటిని శ్రద్ధ లేకుండా విసిరేసినట్లుగా చేస్తే లక్ష్మీదేవి ఉండదట.
అందుకనే డబ్బుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చి.. బట్టలను నీటిగా కింది బాగంలో పెట్టుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
అలాగే బీరువా ఓపెన్ చేయగానే చక్కటి వాసన వచ్చేలాగా.. ఏవైన సుగంధాలను, సెంట్లను ఉపయోగిస్తే మంచిదట.
ఎందుకంటే బీరువా తీయగానే బట్టలు మక్కిన వాసన లేదా ఏదైనా చెడు వాసనలు వస్తే లక్ష్మీదేవి ప్రాప్తి ఉండదట.