ఎవరు ఎంత అడిగినా ఇంట్లో ఉండే ఈ వస్తువులు ఎవరికీ ఇవ్వద్దు.. ఇచ్చారంటే బిచ్చమెత్తుకునే స్థాయికి పోతారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంటిలో ఉండే కొన్ని వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదట.
అలా కొన్ని వస్తువుల దానంగా ఇచ్చినట్లుయితే.. మీ ధనం పోయి మీరు బిచ్చమెత్తుకునే స్థాయికి వెళిపోతాయని శాస్త్రలు చెబుతున్నాయి.
మనం వడే వస్తువులకు గ్రహాలతో కొంత సంబంధం ముడిపడి ఉంది. ఆ వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల తీవ్రమైన చెడు ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని వస్తువులు దానంగా ఇవ్వకూడదట.
అలాగే ఆడవారు కూడా సూర్యాస్తమయం తర్వాత పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకోకూడదట. ఇంతకి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం...
సూర్యాస్తమయం తర్వాత పెరుగును దానం చేయకూడదని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది పెరుగును నైవేద్యంగా పెడతారు. అలాంటి వస్తువు దానం ఇవ్వడం వల్ల మన ఇంట్లో నుంచి లక్ష్మీ దేవి వెళిపోతుందట.
పాలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అలాంటి పాలు ఇతరులకు దానంగా ఇవ్వడం అంత మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అంతే కాకుండా.. ప్రతి పౌర్ణమికి చంద్రుడికి పాలను చూపిస్తే.. చంద్రుని అనుగ్రహం కలిగి ఆ ఇళ్లు సుఖసంతోషాలతో ఉంటుందట. ఇక పాలు ఎవరి దగ్గరైనా తీసుకుంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఉచితంగా తీసుకోరాదట.
పసుపు గురుగ్రహానికి కారకంగా చెప్పుకోవచ్చు. ప్రతి శుభకార్యంలో పసుపును ఉపయోగిస్తారు. లక్ష్మీదేవి స్వరూపమైన పసుపుని సాయంత్రం టైంలో దానం చేయరాదు. అలా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గురుని అనుగ్రహం కూడా కోల్పోతారట.
అదేవిధంగా పుట్టింటి నుంచి ఆడపిల్లలు పసుపుని తెచ్చుకోకూడదు. అంతగా అయితే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు. లేదంటే మీ పుట్టింటి నుంచి లక్ష్మీ వెళిపోయి వారు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు.
ఉల్లి, వెల్లుల్లి కూడా ఇతరులకు దానంగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఉల్లి, వెల్లుల్లి కేతు గ్రహానికి చెందినవి. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత వీటిని దానం చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
మనం రోజు ధరించే చేతి గడియారం మన మంచి, చెడుల యొక్క అదృష్టంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మన వాచ్‌ని ఇతరులకు ఇవ్వడం ద్వారా మన అదృష్టరేఖలు తారుమారు అవుతాయట. కానీ గిఫ్ట్ రూపంలో మాత్రం ఇతరులకు వాచ్ ఇస్తే మంచిదట.
చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మన ఇంట్లో చీపురుని ఎవరికి దానంగా ఇవ్వకూడదు. అంతే కాకుండా తల్లిదండ్రులు డబ్బుతో కొనిచ్చిన చీపురును కూతురు తీసుకోకూడదు.