ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు.. హెచ్చరిస్తున్న నిపుణులు!

చాలా మంది భోజనం చేసిన తర్వాత లేదా ఏదైనా ఆహారం తినగానే నీళ్లు తాగుతుంటారు.
అయితే ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాపిల్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ, వాటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే మంచిది కాదు.
అలాగే అరటి పండు తిన్నాక నీరు సేవిస్తే రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం పడుతుంది.
దానిమ్మ ముందుగానే నీరు శాతం కలిగిన పండు కాబట్టి దీన్ని తిన్నాక నీళ్లు తాగితే వికారం, అసిడిటీ వంటివి వస్తాయి.
నారింజ, గూస్బెర్రీస్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు తిన్నాక నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందరూ ఇష్టంగా తినే పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీరు తాగకుండా ఉండటం మంచిది.