ఎక్కువ రోజులు ఊరెళ్లేవారు ఫ్రిడ్జ్‌లో వీటిని పెడుతున్నారా?

మనం ఇల్లు విడిచి ఎక్కువ రోజులు వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఫ్రిడ్జ్‌లోని వస్తువులను చాలామంది అలాగే ఉంచి వెళ్తారు.
అలా ఉంచడం వల్ల కూరగాయలు, ఆహార పదార్థాల్లాంటివి కుళ్లిపోయి, ఫ్రిడ్జ్ మొత్తం చెడు వాసన వస్తుంది.
మీరు ఊరు వెళ్తున్నప్పుడు వీలైనంతవరకు ఫ్రిడ్జ్ నీటితో లేదా వెనిగర్‌తో ఫ్రిడ్జ్ షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసి వెళ్లండి.
పాలు, పెరుగు లాంటివి ఉంటే వెంటనే వాటిని తీసి పాడేయ్యండి.
వీలైతే ఫ్రిడ్జ్ ఫ్లగ్ కూడా తీసేయ్యండి.
దీని వల్ల కరెంట్ ఫ్లో లో ఎలాంటి మార్పులు ఉన్నా ఫ్రిడ్జ్ కు ప్రమాదం జరగకుండా ఉంటుంది. అలాగే కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.
ఇలా చేస్తేనే ప్రిడ్జ్ ఎక్కువ రోజులు పాడవకుండా పనిచేస్తుంది.