పెరిగిపోయిన విడాకుల ఘటనలు.. అసలు సమస్యలు వస్తుంది ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం చాలా మంది పెళ్లీలు చేసుకుని చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కొందరైతే మరీ దారుణంగా పిల్లలు ఉన్నా కానీ వారి గురించి ఆలోచించకుండా వెరైపోతున్నారు.
ఇటీవల ఇలాంటి సంఘటనలు ఏదో ఒక చోట జరగడం కామన్ అయిపోయింది. భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వస్తే అర్థం చేసుకోకుండా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు.
అయితే విడాకులకు కారణాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.
శారీరకంగా, మానసికంగా మాటలు అని భాగస్వామిని విసిగించకూడదు. అలాగే వారిని అర్థం చేసుకోవాలి కానీ వారిపై కోపం చూపించకూడదు.
మీ పార్ట్‌నర్ ఏదైనా విషయం గురించి పదే పదే బాధపడుతుంటే సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించాలి. కానీ అలాగే వదిలేయడం వల్ల కూడా అర్థం చేసుకోవట్లేదు అన్న కారణంగా విడాకులకు దారితీయవచ్చు.
వారు చేసే పనుల్లో విఫలం అయితే తిట్టకుండా వారిని ఎంకరేజ్ చేయాలి. వారి కష్టాన్ని గుర్తించి వారికి సపోర్ట్‌గా ఉండాలి.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి భార్యాభర్తలకు మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. ఈ సమయంలో రిలేషన్‌లో ఉండలేక విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది.
మీ భాగస్వామికి మానసిక సమస్యలు ఉన్నా దాని వల్ల చుట్టూ ఉన్నవారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే తట్టుకోలేరు. కాబట్టి అది పార్ట్‌నర్ అయినా కానీ దూరంగా ఉండాలనుకుని విడాకులు తీసుకుంటారు.