వర్షంలో మీ స్మార్ట్ ఫోన్ తడిసిపోయిందా.. సూపర్ టిప్స్ మీకోసమే!

ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు వర్షంలో వెళుతూ చాలా ఇబ్బంది పడుతుంటారు.
ఈ క్రమంలో కొంతమంది స్మార్ట్ ఫొన్ తడిసిపోతుంది. వర్షంలో ఫొన్ తడవడంతో చాలా బాధపడుతుంటారు, వారికోసమే ఈ చిట్కాలు.
మొబైల్ తడిసిన వెంటనే పనిచేస్తుందో, లేదో అని ఆన్ చేయకూడదంట.
మొబైల్ తడిసిందని, డివైజ్ లోపలికి నీళ్లు పోయాయని మీకు అనిపిస్తే వెంటనే స్విచాఫ్ చేయాలి.
ఫొన్ వర్షంలో తడిసినప్పుడు స్విచ్చాఫ్ చేసి సిమ్ కార్డ్, మెమొరీ కార్డ్ లాంటివి తీసేసి, ప్రొటెక్టీవ్ కేస్ తొలగించాలంట.
మీకు వాటర్ కనిపిస్తుంటే మెత్తటి క్లాత్ తీసుకొని నెమ్మదిగా తుడిచెయ్యాలి.
నీటిని తొలగించడానికి హెయిర్ డ్రయర్ లాంటివాటిని అస్సలు ఉపయోగించకూడదంట, దీని వలన ఫోన్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది.