డయాబెటిస్ పేషెంట్లు అరటిపండు లేదా ఆపిల్.. ఏది తింటే మంచిది?

షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచాలంటే డయాబెటిస్ పేషెంట్లు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే ప్రతిరోజు ఒక ఆపిల్‌ తింటే డాక్టర్ అవసరం ఉండదని.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజాగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
షుగర్ పేషెంట్లు, అధిక బరువు ఉన్నవారు అరటిపండ్లు తినడం కంటే ఆపిల్ తింటే మేలని అంటున్నారు.
ఎందుకంటే ఫైబర్ సమృద్ధిగా ఉండే యాపిల్‌ జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్‌ను దరిచేరకుండా చేస్తాయి.
శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆపిల్‌లో ఫైబర్ సమృద్దిగా ఉండటం వల్ల పేగులకు మేలు చేసే బ్యాక్టీరియాలను ప్రోత్సహించి.. బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది.
అరటిపండు కంటే రెండు రెట్లు ఆపిల్‌లోనే మంచి గుణాలున్నాయని చెబుతున్నారు.
కాగా షుగర్ పేషెంట్లు ఆపిల్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.