కూల్ డ్రింక్ డ్రగ్స్, ధూమపానం, ఆల్కాహాల్‌తో సమానం.. అది తాగిన గంట లోపల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రస్తుతం ఉన్న ఎండలకు చాలా మంది కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.
అయితే.. కూల్ డ్రింక్స్ తాగడం మన శరీరానికి హాని కరమని తెలుసా..? అసలు కూల్ డ్రింక్ తాగిన గంట లోపల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..!
కూల్ డ్రింక్ తాగడం అంటే నేరుగా పంచదారను తినడమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే 350 ఎమ్ ఎల్ కూల్ డ్రింక్‌లో 35 నుంచి 45 గ్రాముల పంచదార ఉంటుంది.
కూల్ డ్రింక్‌లో ఉండే ఫాస్పారిక్ యాసిడ్.. డ్రింక్స్‌లో ఉండే షుగర్ స్థాయిలను శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోయేలా చేస్తుంది.
అయితే కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాల తరువాత అందులో ఉండే కెఫిన్‌ను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అంతే కాదు రక్త పోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
కూల్ డ్రింక్స్‌ను తాగిన 50 నిమిషాల తరువాత మెదడులో సంతోషాన్ని కలిగించే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో మనకు ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది.
డ్రగ్స్ తీసుకోవడం, ధూమపానం చేయడం, ఆల్కాహాల్ తీసుకుంటే ఎలా ఉంటుందో కూల్ డ్రింక్ తాగిన అలానే ఉంటుంది. దీంతో మన మెదడు పదేపదే కూల్ డ్రింక్ తాగమని ప్రోత్సహిస్తుంది.
కూల్ డ్రింక్ తాగడం వల్ల మనం ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతుంది. అలాగే శరీరం దానిలో ఉండే పోషకాలను కోల్పోతుంది. దీంతో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కూల్ డ్రింక్ తాగడం వల్ల మన శరీరానికి ఎటువంటి మేలు ఉండదు కాబట్టి... అది మానేయడమే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.