జుట్టు రాలడాన్ని నియంత్రించి.. ఒత్తైన హెయిర్ కావాలంటే వీటిని తప్పనిసరిగా తినాల్సిందే?

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులతో బిజీబిజీగా మారిపోయింది. దీంతో పలు కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
దీంతో చాలా మంది యువతీయువకులు చిన్న వయసులోనే జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అలా కాకుండా ఒత్తైన హెయిర్ ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తినాలని నిపుణులు చెబుతున్నారు.
కేశాల సౌందర్యం కోసం ఉసిరి రసం ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, జుట్టు రాలడాన్ని నిరోధించి పెరగడానికి దోహదపడుతుంది.
బచ్చలి కూరలో ఉండే ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కెరోటినాయిడ్స్ జుట్టుకు అద్భుత ప్రయోజనాలను కలిగిస్తాయి.
జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా ఉండాలంటే కీరదోసకాయలను తినాలి. ఇందులో ఉండే విటమిన్ ఏ, జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది.
కివీ పండ్లు ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా చాలా లాభాలను కలిగిస్తాయి. విటమిన్ ఈ జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు కుదుళ్ల పెరుగుదలకు దోహదపడుతుంది.
అలాగే హెయిర్ ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఎక్కువగా వాటికే ప్రాధాన్యతను ఇవ్వాలి.