అల్లం అధికంగా తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?

అల్లంతో ఆరోగ్యానికి మంచి లాభాలు కలుగుతాయని టీలో వేసుకుని కర్రీస్‌లో వేసుకుని తింటుంటారు.
అయితే అల్లం అధికంగా ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం అధికంగా తీసుకుంటే గుండె‌లో దడ వస్తుంది. అలాగే నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో అల్లం వినియోగానికి దూరంగా ఉండాలి. లేదంటే గర్భస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇది శరీరంలో రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. అలాగే మధుమేహ బాధితులు అల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
అల్లం ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యకు కూడా కారణమవుతుంది.
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, శ్వాస లోపం, దురద, పెదవుల వాపు, కళ్లలో దురద వంటివి వస్తాయి.
కాబట్టి అల్లం అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.