మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారులకు తుంటి ఎముకలు విరిగే రిక్స్‌ 50% ఎక్కువట

మహిళల్లో, పురుషుల్లో ఈ ప్రమాదం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
పురుషుల కంటే స్త్రీలల్లోనే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా తలెత్తుతుందని తెలిపింది.
లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 413,914 మంది వ్యక్తుల నుంచి డేటాను తీయగా.. మాంసాహారం తినే మహిళలు, పురుషుల కంటే.. శాఖాహారులలో తుంటి ఎముకలు పగుళ్లకు గురయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు.
పురుషులపై శాకాహార ప్రభావం తక్కువగా, అసంపూర్తిగా ఉన్నట్లు దీనిలో గుర్తించారు.
2006 నుంచి 2010 మధ్య చేసిన అధ్యయనంలోని వ్యక్తులు, వారి ఆహారంపై సమాచారాన్ని అందించారు.
వారానికి ఐదు, అంతకంటే ఎక్కువ సార్లు మాంసం తినే వారు, అప్పుడప్పుడు మాంసం తినే వ్యక్తులు, వారానికి ఐదు సార్లు కంటే తక్కువ మాంసం తినేవాళ్లు, కేవలం చేపలు తినే వ్యక్తులు, మాంసం, చేపలు కాకుండా పాలు తాగే వ్యక్తుల ఇలా వర్గీకరించారు.
ఈ అధ్యయనంలో మాంసాహారం తినేవారికంటే.. శాకాహారులలో తుంటి ఎముక విరిగే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు.
హిప్ ఫ్రాక్చర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రమాదాన్ని ప్రభావితం చేయడంలో ఆహారం కూడా పాత్ర పోషిస్తుందని.. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌లోని న్యూట్రిషనల్ ఎపిడెమియాలజీ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న, పరిశోధనను పర్యవేక్షించిన ప్రొఫెసర్ జానెట్ కేడ్ ఇలా చెప్పారు.