చికెన్ లేదా మటన్.. బరువు తగ్గడానికి ఏది బెటర్..!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి బరువు తగ్గడం అనేది పెద్ద సవాలుగా మారింది.
వెయిట్ లాస్ అయ్యేందుకు పలు చిట్కాలు పాటిస్తూ.. డాక్టర్ సలహాలు కూడా తీసుకుంటుంటారు.
అయితే చలికాలంటో బరువు తగ్గడం చాలా కష్టమైన పని. ఈ సీజన్‌లో చెమట ఎక్కువగా రాదు కాబట్టి కొవ్వును కరిగించడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు.
చికెన్, మటన్ తినడం పూర్తిగ మానేస్తే వెయిట్ లాస్ అవుతారని పలువురు చెబుతుంటారు. కానీ చికెన్, మటన్ మానేయడం అంత సులువైన పని కాదు.
అయితే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. 100 గ్రాముల చికెన్‌లో 3.12 కొవ్వు, 24. 11 గ్రాముల ప్రోటీన్, 140 కేలరీలు ఉంటాయి.
అలాగే చికెన్‌లో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఇనుము వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కాగా చికెన్ తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చికెన్‌లో కన్నా మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
డైట్‌ను ఫాలో అవుతున్న వారు వారానికి రెండు సార్లు చికెన్ తింటే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ రోల్స్, చికెన్ సూప్, గ్రిల్డ్ చికెన్.. అలాగే పెరుగు చికెన్‌ను మీ ఫుడ్‌లో యాడ్ చేసుకున్నా వెయిట్ లాస్ అవుతారు.