ప్రస్తుత రోజుల్లో పైల్స్, హెమరాయిడ్స్ అనేది సర్వసాధారణ అనారోగ్యపు సమస్యగా మారింది.
అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల పైల్స్ నుంచి బయట పడొచ్చు. అవేంటో చూద్దాం..
కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగాలి.
పైల్స్‌కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్‌ను తాగండి.
అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.
పచ్చి ఉల్లిపాయ మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. వీటిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్‌ను తగ్గిస్తుంది.
పైల్స్ నివారణకు అరటిపండు కూడా ఎంతగానో మేలు చేస్తుంది.
బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులను శుభ్రపడేలా చేస్తాయి.
పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగాలి.