ప్రస్తుత రోజుల్లో చెస్ట్ క్యాన్సర్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతూ మహిళల ప్రాణం తీస్తోంది.
కొంతమంది జనాలకు అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
అయితే బ్రస్ట్ క్యాన్సర్ లక్షణాలు ముందుగానే గుర్తించి ఈ కూరగాయలను తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు.
కాలీ ఫ్టవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూరసిఫరస్ కూరగాయలు అధికంగా తింటే స్త్రీలలో చెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను నయం చేసే బ్రోకలీ చెస్ట్ క్యాన్సర్ నివారించడానికి ఎంతగానో మేలు చేస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే టమాటా ఈ క్యాన్సర్తో పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది.
అలాగే క్యాలీ ఫ్లవర్ రుచికరంగా ఉండడమే కాక మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను సరఫరా చేయడానికి, రొమ్ము క్యాన్సర్ దరి చేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
అలాగే క్యాబేజీ కూడా రొమ్ము కాన్సర్ దరి చేరకుండా ఉండేందుకు ఎంతో మేలు చేస్తుంది.
కాబట్టి క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ కూరగాయలను అధికంగా తీసుకోండి. చెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టండి