వీటిని కుక్కర్‌లో ఉడికిస్తున్నారా? అయితే మీరు విషం తింటున్నట్లే!

మనం తినే ప్రతి ఆహార పదార్థాన్ని వండేందుకు ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. అలా కాకుండా అవగాహలేని యూట్యూబ్ చానెల్లు చూస్తూ లేదా సొంత ప్రయోగాలు చేయడంవల్ల ఆహారం విషతుల్యంగా మారే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా కొన్ని రకాల వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల రుచి పోవడమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
అన్నం: ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. బియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉడటం వల్ల ఇది హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. దానివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
బంగాళదుంపలు: బంగాళదుంపలు తొందరగా ఉడుకుతాయని చాలామంది ప్రెషర్ కుక్కర్‌లో వేస్తారు. కానీ, బియ్యంలో ఉన్నట్టుగానే వీటిల్లోనూ స్టార్చ్ మోతాదు అధికంగా ఉంటుంది. వీటిని కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పాస్తా: చాలామంది లొట్టలేసుకుని తినే పాస్తా కొంతమంది ప్యాన్‌పై చేస్తే మరికొంతమంది మాత్రం ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగిస్తారు. ఇందులోనూ స్టార్చ్ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్యాన్‌పై కుకింగ్ చేసుకోవడం మంచిదని న్యూట్రిషియన్స్ చెప్తున్నారు.