అందమైన ముఖానికి, కళ్లకు మస్కారా మరింత అందాన్ని ఇస్తుంది. ఆకర్షిణీయంగా ఉంటాయి. అందం కోసం మస్కారా పెట్టా్ల్సిందే. అలాగే.. మస్కారా పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
చాలా మంది తక్కువ ధరకు వచ్చేవాటిని ఉపయోగిస్తారు. అలా చేయడం వల్ల కళ్లు, కనురెప్పలు పాడవుతాయి. అందుకే మంచి బ్రాండ్, క్వాలిటీ ఉండేవి తీసుకోవాలి.
కనురెప్పలు చాలా సున్నితమైనందున కెమికల్స్‌తో పొడిభారిపోతాయి. మస్కారా పెట్టుకునే ముందు కనురెప్పల్ని మాయిశ్చరైజ్ చేయాలి. పెట్రోలియం జెల్లీ, జొజోబా నూనె, కొబ్బరి నూనె వంటివి కళ్లకు అప్లే చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు.
ఒకసారి మస్కారా రాసుకున్నాక కాసేపు ఆరనిచ్చి మరో కోటింగ్ వేయొచ్చు. ఇలా రెండు సార్లు చేస్తే చాలు. అంతకుమించి ఎన్నిసార్లు వేసినా ప్రయోజనం లేదు.
కనురెప్పలు ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీపౌడర్ అద్ది ఆ తర్వాత మస్కారా రాసుకుంటే సరి. ఐల్యాష్ కర్లర్‌తో రెప్పలను నొక్కి ఆ తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా, చక్కగా కనిపిస్తాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి మస్కారా వాడవద్దు. ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే గడువుతేదీ దాటిన వాటిని వాడొద్దు.
మస్కారా పెట్టుకోవడమే కాదు.. తొలగించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మస్కారా తీయడానికి మిసెల్లార్ వాటర్/మేకప్ రిమూవర్‌ని ఉపయోగించచ్చు. వీటిని కాటన్ బాల్‌పై వేసి.. దాంతో కనురెప్పలపై అద్దాలి. గట్టిగా రుద్దితే కనురెప్పల వెంట్రుకలు రాలే అవకాశం ఉంది.
ఫార్మాల్డిహైడ్, సింథటిక్, టార్ డైస్.. వంటి పదార్థాలు ఉపయోగించి తయారుచేసిన మస్కారాలు అస్సలు వాడకూడదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.