జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయొచ్చా లేదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా సహా అనేక రకాల జ్వరాలు చుట్టుముడతాయి.
ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు స్నానం చేస్తే.. అది శరీరంపై మరింత ప్రభావం చూపుతుందని స్నానం చేయడం మానేస్తారు.
అయితే.. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది.. న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ ప్రివెంటివ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సోనియా రావత్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక జ్వరం ఉన్నప్పుడు టవల్‌ని చల్లటి నీటితో తడిపి శరీరాన్ని తుడుచుకోవడం వల్ల జ్వరం నుంచి కొంతవరకు ఉపశమనం పొందచ్చు. అయితే దీనికి ఐస్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ ఉపయోగించాలట.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా బాడీ పెయిన్స్ తగ్గి కండరాలకు విశ్రాంతి కలుగుతందట.
కొంత మంది జ్వరంలో తల స్నానం చేయొచ్చా లేదా అని అనుకుంటారు. అయితే.. తల స్నానం చేయడం వల్ల శరీరంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదని నిపుణులు తెలుపుతున్నారు.
కానీ.. జ్వరంతో ఉన్నవారు స్నానానికి గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలట. చల్లటి నీరు అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.