బాదం తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే?
డ్రైఫ్రూట్స్‌లో చాలా మంది ఎక్కువగా బాదంలను తింటుంటారు. అయితే వీటిని తింటే లావు అవుతారని చాలా మంది అనుకుంటారు.
అయితే దీనిపై నిపుణులు అవన్నీ అపోహాలు అని అంటున్నారు. అలాగే బాదం తినడం వల్ల బరువు తగ్గుతారని తెలిపారు.
బాదం తినడం వల్ల విటమిన్ ‘ఇ’ మోనో అన్శాచురేటెడ్ కొవ్వులు వృద్ధి చెందుతాయి.
అలాగే మహిళలు రోజూ బాదం తింటే 35 శాతం వరకు గుండె సంబంధిత సమస్యలు రావు.
బాదంలో క్యాలరీలు, పీచు పదార్థాలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించడంలో సహాయ పడతాయి.
బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరను అదుపు చేస్తుంది. కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి.
ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
క్యాన్సర్ నివారణలో బాదం సహాయం చేస్తుంది. మొత్తానికి బాదం తినడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు తెలిపారు.
ఇందులోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బాదంలో ఫాస్పరస్ శాతం కూడా అధికం. ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.