అవిగ్డోర్ కాహనర్ అనే ఇజ్రాయెల్ శాస్త్రవేత్త.. ఎండాకాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలను తట్టుకునేలా 2002 లో ఈకలు లేని కోళ్లను సృష్టించాడు.
బాయిలర్ కోళ్ల స్థానంలో ఈకలు లేని కోళ్లను క్రియేట్ చేశాడు. కానీ ఇవి ఇంకా మార్కెట్‌లోకి రాలేదు.
ఇప్పుడు మార్కెట్‌లో అవైలెబుల్‌గా ఉన్న బ్రాయిలర్ కోళ్లు జన్యుపరంగా మార్పు చేయడం ద్వారా చిరుతిండి ఎక్కువగా తింటున్నాయి. దీంతో వాటి బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది.
ఈ కోళ్లు తొందరగా పెరగడం వల్ల వ్యాపారులు డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నారు. కానీ ఇవి వేడి వాతావరణంలో బతకడం కష్టమంటున్నారు.
అయితే ఈ సమస్యకు అల్టర్‌నెట్ ఏంటని ఆలోచిస్తే ఈకలు లేని కోడిని సృష్టించడం. ఈ కోళ్లు ఇరవై ఏళ్లు అవుతున్నా మార్కెట్లోకి ఇంకా రాలేదు.
ఎందుకంటే ఇజ్రాయిల్ శాస్త్రవేత్త బాయిలర్ కోళ్లను తీసుకొని కంప్లీట్‌గా ఈకలు లేని కోళ్లను సృష్టించాడు. వీటి రూపం ఎవ్వరికీ నచ్చడం లేదట.
కానీ తక్కువ ఆహారంతో ఫాస్ట్‌గా వృద్ధి చెందడం, వేడిని తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది.
వీటిని బాయిలర్ కోళ్ల వలే ఎటువంటి సందేహం లేకుండా తినొచ్చు. కానీ దోమకాటు, చర్మవ్యాధులు, వడదెబ్బ, ఉష్ణోగ్రతలో వైవిధ్యాలను ఈ జాతి తట్టుకోలేదని తేలడంతో ఇంకా మార్కెట్లోకి తీసుకురాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.