తులసి మొక్కను బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవచ్చా? హిందూ ధర్మం ఏం చెప్తోంది?

హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైందిగా భావించి పూజిస్తారు.
కొన్ని ప్రత్యేక రోజుల్లోనే తులసిని ఇంటికి తీసుకురావడం మంచిదని శాస్త్రం చెబుతుంది.
తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం శుభప్రదంగానే పరిగణించబడుతుంది.
దీన్ని అందించడం ద్వారా ఇతరుల ఇంటికి మీరు సానుకూల శక్తిని ప్రసారం చేస్తారు.
ఇంట్లో వాస్తు ప్రకారం తులసి మొక్కను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్యదిశ.
గాలిని శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి సహాయపడుతుంది.
ఇక తులసి మొక్కను తాకడం నిషేదించబడిన రోజున ఈ మొక్కను ఎవ్వరికీ దానం చేయకూడదు.
ఆదివారం, ఏకాదశి తొలిరోజు తులసిని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకండి.
ఎండిన మొక్కను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
మతపరమైన పండుగలు, వివాహాలు, గృహ ప్రవేశాల్లో సమర్పిస్తే అనుకూలంగా ఉంటుంది.
వాస్తు ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైంది. బహుమతిగా ఇచ్చిన తులసి మొక్కను సరిగ్గా కాపాడుకోవడం మన విధి.