షుగర్ పేషెంట్స్ వేసవిలో పుచ్చకాయ తినొచ్చా?

ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి ఉంటుంది.
అయితే ఈ వ్యాధి ఉన్నవారు తియ్యగా ఉండేవి ఏవి తినకూడదని వైద్యులు చెబుతుంటారు.
కాగా, వేసవిలో పుచ్చకాయ తినవచ్చాలేదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది.
అయితే పుచ్చకాయ విషయంలో వైద్యులు భయం అక్కర్లేదంటున్నారు.
గ్లెసెమిక్ ఇండెక్స్ (జీఐ) అధికంగా ఉండే పండ్ల విషయంలో డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలంట.
కానీ పుచ్చకాయలో జీఐలో 72శాతం ఉంటుంది, కానీ ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండి పదార్థం తక్కువ ఉంటుంది.
కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు గ్లూకోజ్ పెరిగినప్పటికీ తగ్గిపోతుంది, అందువలన పుచ్చకాయ తినొచ్చు అంటున్నారు వైద్యులు.