మహిళల్లో ఎక్కువగా వచ్చే ప్రధాన సమస్య రుతుక్రమం సరిగ్గా రాకపోవడం.
కొంతమంది ఆడవాళ్లకు పీరియడ్స్ రెగ్యూలర్‌గా వచ్చినప్పటికీ.. మరికొంతమందికి రోజులు కాదు.. నెలల తరబడి మిస్ అవుతూ ఉంటాయి.
పీరియడ్స్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి స్త్రీ హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుంది. ఈ హార్మోన్లు అసమతుల్యంగా మారితే రుతుక్రమం రెగ్యూలర్‌గా కావు.
కాగా ఇర్రెగ్యూలర్ పీరియడ్స్ ఆడవారి హెల్త్‌పై ఎంతగానో ప్రభావం చూపిస్తాయని.. అయితే వీటికి ముఖ్య కారణాలు ఇవే అంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత సమాజంలో చాలా మంది గర్భనిరోధక టాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారు. దీంతో పీరియడ్స్ మిస్ అవుతాయని నిపుణులు అంటున్నారు.
మానసిక ఒత్తిడి ఆరోగ్యాన్నే కాదు.. శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే ఆడవారికి పీరియడ్స్ నెలసరి రావు.
అలాగే పలు రకాల మందులను వాడటం వల్ల పీరియడ్స్ మిస్ అవుతాయి. 2, 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు కనుక పీరియడ్స్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి చెకప్‌లు చేయించుకోవడం మేలు.