బాదం, కిస్మిస్ కలిపితినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

ఈ రోజుల్లో మన ఆరోగ్యం బాగుండాలంటే డ్రైఫ్రూట్స్ ఎంతో మంచిది. అందులో ఉండే విటమిన్స్ శరీరానికి శక్తిని ఇస్తాయి.
డైప్రూట్స్‌లో బాదం, కిస్మిస్, ఖర్జూరం, పిస్తా, వాల్ నట్స్, అంజీర్ అనేక రకాలు ఉంటాయి.
అయితే.. చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. డ్రై ప్రూట్స్‌లో బాదం, కిస్మిస్ కలిపి తినొచ్చా లేదా అని. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
బాదం, కిస్మిస్‌లు ఎముకలను బలంగా మార్చేందుకు ఎంతో సహాయపడతాయి. అలాగే జ్ఞాపకశక్తి ని కూడా పెంచుతాయి.
బాదం, కిస్మిస్ కలిపి తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ చర్మ కాంతిని మెరుగుపరచడమే కాకుండా.. వెంట్రుకుల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి.
వీటిని కలిపి తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరానికి అవసరమైన న్యూట్రిషయన్లు అందించి అలసటను దూరం చేస్తుంది.
అయితే.. బాదం, కిస్మిస్‌లు డైరెక్ట్‌గా తినకుండా నానబెట్టి తినడం మంచిదని, బాదం పప్పుపై పొట్టు తీసి తినాలని నిపుణులు తెలుపుతున్నారు.