హాల్లో బాయ్స్..! మీ గడ్డం పెరగాలంటే ఈ ఐదు టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
అబ్బాయిలకు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గడ్డం.. చాలా మందికి గడ్డం తక్కువగా ఉంటుంది.
గడ్డం పెంచుకునేందుకు ఖరీదైన ఉత్పత్తులు తరచుగా ఉపయోగిస్తుంటారు. అయిన్పటికీ చాలా మంది పురుషుల గడ్డాలు చాలా సన్నగా, పొట్టిగా ఉంటాయి.
అయితే.. ఈ ఐదు పనులు ఫాలో అయితే మీ గడ్డం పెరుగుతుందట. మరి అవేంటో తెలుసుకుందాం.
బయోటిన్ సప్లిమెంట్: బి విటమిన్ బయోటిన్ ఒకటి. బయోటిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల గడ్డం వెంట్రుకలు పెరగడమే కాకుండా.. స్కాల్స్ హెయిర్ గ్రోత్ కూడా మెరుగుపడుతోంది.
టీ ట్రీ ఆయిల్: ప్రతి రోజు పడుకునే ముందు టీ ట్రీ ఆయిల్‌లో ఆముదం కలిపి గడ్డానికి మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల గడ్డం త్వరగా పెరుగుతోంది.
బాదం నూనె: ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉండి గడ్డం పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రోజు పడుకునే ముందు ఈ నూనెతో గడ్డానికి మసాజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.
ఫేస్ ప్యాక్: ఫేస్ ప్యాక్ ద్వారా కూడా గడ్డం పెరుగుదల ఉంటుంది. ఉసిరి, ఆవాలు కలిపి మెత్తగా పేస్టు చేసుకుని.. ఆ పేస్ట్‌ను ముఖంతో పాటు గడ్డానిని కూడా ఆప్లే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది.
కత్తిరించడం: వారానికి ఒక సారైన గడ్డం కత్తిరించడం మంచిది. దీని ద్వారా గడ్డం బాగా పెరగడానికి సహాయపడుతోంది.