నల్ల జామ పండ్లను మీరెప్పుడైనా తిన్నారా..? మధుమేహస్తులు చూస్తే వదిపెట్టారు!

నల్ల జామ అంటే వింతగా ఉన్నది కదూ.. నాటు, తైవాన్ జామ మాదిరిగానే ఇదీ ఉంటుంది.
పైన నల్లగా.. లోపల ఎర్రటి గుజ్జుతో ఆకట్టుకుంటుంది ఈ నల్లని జామపండు.
బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ పండులో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటవిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ జామలో విటమిన్ సి, విటమిన్ ఎ, బి, ఇతర మల్టీ విటమిన్లతో పాటు మినరల్స్, అత్యధిక మోతాదులో కాల్షియం, ఐరన్, కొంత మొత్తంలో ప్రొటీన్ లభిస్తుంది.
ఇవి తింటే శరీరంలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించవట. జీర్ణ సంబంధింత సమస్యలతో బాధపడే వారు ఈ జామకాయలు తింటే ఉపశమనం లభిస్తుందట.
డ‌యాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదట.
రక్తహీనత తగ్గి.. ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. మలబద్ధకం, ఇతర ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్, నిపుణులు సూచనల మేరకు ఇచ్చినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా డాక్టర్లను సంప్రదించడం మంచిది.