ఈ సీజన్‌లో పిల్లలకు అరటిపండు తినిపిస్తే ఏమవుతుందో తెలుసా?

శీతాకాలంలో చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారులకు ఈ ప్రభావం చాలా ఉంటుంది.
అందువల్ల తల్లిదండ్రులు పిల్లల ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
కొంత మంది పిల్లలకు అరటిపండును తినిపిస్తే ఏమవుతుందో అన్న అనుమానంలో ఉంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
అరటిపండులో ఉండే విటమిన్లు, పోషకాల వల్ల పిల్లలకు మంచి ఫలింతం ఉంటుంది కాబట్టి దీనిని కచ్చితంగా తినిపించాలి.
అరటిపండు జీర్ణక్రియను, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి పిల్లలను యాక్టీవ్‌గా ఉంచుతుంది.
ప్రతిరోజూ ఒక అరటిపండు తినే పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు.
పిల్లల్లో మలబద్ధకం ఉంటే.. కచ్చితంగా అరటిపండ్లను తినిపించాలి.
గమనిక: రాత్రిపూట పిల్లలకు అస్సలు అరటిపండు పెట్టకూడదు. దీనివల్ల జలుబు, దగ్గు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.