పరగడుపున ఒక స్పూన్ తేనె తింటే ఆరోగ్యానికి చాలా మేలు..

చలికాలం చాలా రకాల వ్యాధులు తలెత్తుంటాయి. వాటితో పోరాడేందుకు పలు చిట్కాలను పాటిస్తుంటారు.
అయితే ప్రతిరోజూ ఉదయం ఒక్క స్పూన్ తేనెతో వాటన్నికీ చెక్ పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు.
తేనె తియ్యాగా ఉంటుంది కాబట్టి దగ్గు, జలుబు వంటివి వస్తాయని కొంత మంది సంకోచిస్తుంటారు. కానీ, అలాంటి అనుమానాలు ఏమి అక్కరలేదు.
తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉండి బాడిని శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులను, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
ప్రతి రోజు నిద్ర లేవగానే ఒక స్పూన్ తేనె తిన్నారంటే జీర్ణక్రీయను మెరుగుపరిచడంతో పాటుగా బరువు తగ్గుతారు.
ఇలా రోజూ చేస్తే బ్యాక్టీరియాను చంపి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది.