నల్ల మిరియాలను ఆహార పదార్థాల్లో ఉపయోగించి తింటే ఏమౌవుతుందో తెలుసా?

నల్ల మిరియాల పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే మిరియాలను పలు ఆహార పదార్థాలలో ఉపయోగించుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నల్లమిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, సోడియం, ఫైబర్ ఉండి జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు నల్ల మిరియాలను ఆహారాల్లో చేర్చడం మంచిది.
గొంతు నొప్పి, నుంచి ఉపశమనం పొందడానికి నల్ల మిరియాల టీ ని తాగడం మంచిది. అంతేకాకుండా నల్ల మిరియాలతో ఉబ్బసం, అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
పైపెరిన్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం మన కణాలు, కణజాలాలను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తుంది. పలు రకాల క్యాన్సర్లు దరిచేరకుండా ఉంటాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్లాక్ పెప్పర్ ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మంచి ఫలితాలుంటాయి కాబట్టి.
ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి నల్ల మిరియాలను డైట్‌లో చేర్చుకోవాలి.