వర్షాకాలం ఈ వస్తువులు ఎవరితోనైనా షేర్ చేసుకుంటే.. ప్రమాదంలో పడ్డట్టే జాగ్రత్త!!

వానాకాలం పని మీద బయటకు వెళ్లినప్పుడు సడెన్‌గా వర్షం పడితే తడుస్తాము కాబట్టి పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా అంటు వ్యాధులు సోకి ప్రమాదంలో పడతారు. కాబట్టి కొన్ని వస్తువులను వర్షాకాలం ఇతరులతో షేర్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకే సబ్బును ఇంట్లో వాళ్లంతా వాడకుండా ప్రతి వారికి ఒక సబ్బును మెయి‌టేన్ చేయడం మంచిది. లేదంటే ఇతరులకు ఉన్న ఇన్ఫెక్షన్ మీకు సోకుతుంది.
ఉదయాన్నే పల్లు తోముకునే బ్రష్‌పై కొన్ని బ్యాక్టిరియాతో పాటు సూక్ష్మ క్రీములు ఉంటాయి. మీ బ్రష్ వేరొకరు వాడటం వల్ల వారికి ఉన్న దంత సమస్యలు మీకు వచ్చే అవకాశం ఎక్కువ.
ఇతరులు వాడుతున్న టవల్ మీరు వాడితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఒక టవల్‌ను వాడాలి.
జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు వేధించకుండా ఉండాలంటే మీ దువ్వెనను ఇతరులు ఉపయోగించకుండా చూడండి.
ముఖ్యంగా అమ్మాయిలు వేరొకరు వాడిన లిప్ బామ్‌ను మీరు ఉపయోగించడం వల్ల మౌత్ హెర్పస్ వస్తుంది.
ఎవరో వాడిన హ్యాండ్ కర్చీఫ్ కూడా మీరు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా చేస్తే వారికున్న దగ్గు, జలుబు వంటివి మీకు వస్తాయి.