బాత్రూమ్.. వాష్రూమ్.. రెస్ట్రూమ్.. ఈ మూడూ ఒకటి కాదా ?

మనలో చాలా మందికి బాత్రూమ్, వాష్రూమ్, రెస్ట్రూమ్ ఈ మూడింటికి తేడా తెలియదు. సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక పదాన్ని వాడేస్తుంటారు. కానీ ఈ మూడు వేర్వేరు.
బాత్రూమ్, వాష్రూమ్, రెస్ట్రూమ్‌కు మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయో తెలుసుకుందాం
బాత్రూమ్.. ఇది జనరల్‌గా అందరికి తెలిసిందే. ఇవ్వి ఇళ్లల్లో, హోటల్స్‌లో ఉంటాయి.
వాషింగ్, టాయిలెట్ సౌలభ్యంతో పాటు స్నానం చేయడానికి షవర్, టవల్ హ్యాండిల్, సోప్ హోల్డర్ వంటి వసతులతో ఉండేది బాత్రూమ్.
సాధారణంగా వాష్రూమ్స్ రెస్టారెంట్, థియేటర్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో ఉంటాయి
వాష్రూమ్స్‌లో టాయిలెట్ సౌకర్యంతో పాటు ముఖం, కాళ్లు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వెసులుబాటు ఉంటుంది.
ఇక రెస్ట్ రూమ్ అంటే.. ఎయిర్ పోర్టు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఉంటాయి. ప్రయాణ సమయంలో బ్రేక్ దొరికితే ఫ్రెషప్ కావడంతో పాటు రెస్ట్ తీసుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు.