సమ్మర్‌లో పెదాలు పొడిబారి పగులుతున్నయా? అయితే ఈ చిట్కాలు మీ కోసం!

పెదాలు పొడిబారి పగిలిపోతే చాలా చికాకుగా ఉంటుంది. పెదాలు పగిలితే చాలా మంది నాలుకతో వాటిని తడి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పెదాలు మరింతగా పొడిబారిపోతాయి.
సమ్మర్ ప్రభావం సున్నితమైన పెదాలపై ఎక్కువగా ఉండడం వల్ల.. పెదాలు పొడిబారి, పగిలి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల పెదాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
అలాగే దోసకాయ ముక్కలు కట్ చేసి బాటిల్‌లో వేసుకొని తాగడం వల్ల పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు.
ఇందుకు కీరదోస, నారింజ, పుచ్చకాయ గుర్తు ఉన్న.. ఎస్.పి.ఎఫ్ ఉన్న లిప్ బామ్ వాడడం మంచిది. ఒక రోజులో ఎక్కువ మొత్తంలో అప్లై చేసుకోవాలి.
చక్కెర, కొబ్బరి నూనెను మిక్స్ చేసి, పెదాలపై సున్నితంగా రుద్దాలి. దీంతో పెదాలపై మర్దనా చేశాక గోరు వెచ్చని నీటితో కడగాలి. తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకోవాలి.
ఈ చిట్కాలను పాటించడం వల్ల పెదాలపై కొత్త చర్మం వృద్ధి చెంది పెదాలు అందంగా మారుతాయి.