నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా..? అయితే ఈ జబ్బుల బారిన పడినట్లే
అమ్మాయిలు ఉపయోగించే వాటిలో ముఖ్యమైనది నెయిల్ పాలిష్. చాలా మంది అయితే నెయిల్ పాలిష్ లేకుండా బయటకు కూడా వెళ్లరు.
అయితే.. ఈ నెయిల్ పాలిష్ ఉపయోగించడం కారణంగా మనకు షుగర్, స్కిన్ ఎలర్జీ, థైరాయిడ్, కిడ్నీ ప్రబ్లెమ్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందట.
ఎందుకంటే నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు గోళ్లు షైనింగ్‌గా కనిపించడానికి అందులో కొన్ని కెమికల్స్ ఉపయోగిస్తారు.
ఈ నెయిల్ పాలిష్‌లో మొత్తం త్రి టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే..
టైప్-1: నెయిల్ పాలిష్‌లో ఉపయోగించే కెమికల్స్, ఇంగ్రీడియన్స్ గురించి ఆ సీసాపైనే చెప్పేస్తారు. ఇది చాలా మంది గమనించి ఉండరు.
టైప్-2: కెమికల్స్ ఉపయోగించినప్పటికీ.. కొన్ని కెమికల్స్ నేమ్స్ మాత్రమే వేసి వీటిని ఇందులో ఉపయోగించలేదు అని చెప్తారు.
టైప్-3: అసలు వీరు ఏ కెమికల్స్ ఉపయోగిస్తున్నారో కూడా చెప్పరు. ఓన్లీ నెయిల్ పాలిష్ గురించి ప్రింట్ ఇచ్చేస్తుంటారు.
కాబట్టి నెయిల్ పాలిష్‌లో ఉపయోగించే కెమికల్స్ కారణంగా పైన చెప్పబడిన వ్యాధులు రావచ్చని అభిప్రాయ పడుతున్నారు వైద్య నిపుణులు.
కాగా.. గోరింటాకు అరచేతితో పాటు గోళ్లకు కూడా పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అందులో ఏ కెమికల్స్ ఉండవు. పైగా.. గోళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా నెయిల్స్ చాలా గట్టిగా మారతాయి.