బాత్‌రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. దీంతో ఎక్కడపడితే అక్కడ ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా బాత్‌రూమ్‌లో 40 శాతం మంది ఫాన్ యూజ్ చేస్తున్నారట. మొత్తానికి సోషల్ మీడియా పిచ్చి జనాలకు ఎంతలా పట్టిందో ఇంగ్లండుకు చెందిన ఓ సంస్థ కొన్ని విషయాలను వెల్లడించింది.
భారత్‌లో ఆన్‌లైన్‌లో గడుపుతున్న వారు 33. 7 శాతం ఉన్నారని సమాచారం.
అలాగే సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్న వారు 18 ఏళ్ల నుంచి 34 వయస్సు గలవారు.
ఒక్కరోజులో సగటున 63 సార్లు ఫోన్ చెక్ చేసుకుంటారు. 75 శాతం మంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కసారైనా మెసేజ్ వచ్చిందా అని చెక్ చేస్తున్నారట.
కొంత మంది రాత్రి నిద్రపోయేటప్పుడు పక్కలో పెట్టుకుని నిద్రపోతారు. దాదాపు 71 శాతం మంది అలాగే చేస్తారు.
పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత ఫోన్ చూసే వారు 87 శాతం ఉన్నారు. అయితే ఫోన్ అతిగా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చి ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.