దోమల నివారణకు మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా.. అయితే అలర్ట్

ఎండాకాలం ఉక్కపోతతో పాటు దోమలు కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయి.
అయితే చాలా మంది దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, ఆల్ ఔట్‌ను వాడితే సమస్యల్లో పడతారు.
మస్కిటో కాయిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
అలాగే అస్తమా వ్యాధితో బాధపడేవారు మస్కిటో కాయిల్స్‌కు దూరంగా ఉండటం మంచిది. లేదంటే శ్వాస కోశ సమస్యలు, దగ్గు వంటివి వస్తాయి.
మస్కిటో కాయిల్ వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ కాయిల్స్‌లో ఉన్న పదార్థాలు శరీరంలోకి వెళ్లి తీవ్రమైన తలనొప్పి వచ్చి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.