లో దుస్తులు ఉతకకుండా వాడుతున్నారా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చాలా మంది లో దుస్తుల గురించి మాట్లాడేందుకు కానీ, వాటి గురించి తెలుసుకునేందుకు కానీ ఇష్టపడరు. కానీ లో దుస్తుల గురించి తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
వర్షాకాలంలో బట్టలు ఉతికిన ఆరవు. దీంతో చాలా మంది వేసినవే ఉతక్కుండా మళ్లీ వాడుతుంటారు. అలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.
చాలా మందికి ప్రైవేట్ పార్ట్స్‌లో దుర్వాసన వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం లోదుస్తులు. లో దుస్తులు క్లీన్ చేయకుండా వేసుకున్నట్లయితే వాటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, చెమట ఈ సమస్యకు కారణంగా మారతాయి.
లో దుస్తులు ఉతకకుండా వాడటం వల్ల చెమట, మూత్ర కణాలు అనేవి ఆ బట్టలకు అతుక్కుని ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాగా మారి ప్రైవేట్ పార్ట్‌లో ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.
తడిగా ఉన్నటువంటి లోదుస్తులు కూడా ఉపయోగించకూడదు. ఇది ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అంతే కాకుండా లైంగికంగా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
ఇన్నర్ వేర్స్ ఉతికినప్పుడు స్ట్రాంగ్‌గా లేని డిటర్జెంట్‌తో ఉతకాలి. వాటిని ఎండలో ఆరబెట్టాలి. దీని ద్వారా బట్టల్లోని బ్యాక్టీరియా మొత్తం పోతుంది. ఎక్కువగా క్లీన్ చేసి, చక్కగా ఆరిన తర్వాత ఇన్నర్ వేర్ ఉపయోగించడం మంచిది.
ముఖ్యంగా మంచి కాటన్ క్లాత్ కలిగిన ఇన్నర్ వేర్ ఉపయోగించడం మంచిది. ఇది చెమటకు తగ్గించడమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ ఇన్ఫెక్షన్ల భారీ నుంచి రక్షిస్తుంది.
గమనిక: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా ఇచ్చినవి మాత్రమే. ఎటువంటి సమస్యలు వచ్చినా డాక్టర్లను సంప్రదించడం మంచిది.