స్టైల్‌గా ఉండాలని హై హీల్స్ వాడుతున్నారా.. ప్రమాదకరమైన సమస్యలు తప్పవు
ప్రస్తుతం చాలా మంది తమను తాము అందంగా స్టైలీష్‌గా మార్చుకోవడానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సెలబ్రిటీస్ లాగా అందంగా ఉండేందుకు పాకులాడుతున్నారు. అయితే అందంగా హైట్‌గా కనిపించాలని హైహీల్స్ వేసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
హై హీల్స్ వేసుకోవడం వల్ల నడుము, తొంటి చుట్టూ నొప్పి, గజ్జల నొప్పి వచ్చి ప్రమాదంలో పడతారు.
అలాగే ప్రతి రోజూ హైహీల్స్ ధరించడం వల్ల మడిమల నొప్పితో పాటు పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
హై హీల్స్ ఆకృతి కారణంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి ప్రమాదకరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
హై హీల్స్ అతిపెద్ద ప్రభావం మోకాలి కీలుపై ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు వేధిస్తాయి.
వీటిని ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంది.
హై హీల్స్ అందరికీ సరిగ్గా సరిపోవు. దీని వల్ల చీలమండలలో నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు హీల్స్ ధరించడం వల్ల కాలి నుండి ఆ నొప్పి శరీర భాగాలపై పడే అవకాశం ఉంది.