హెయిర్ డ్రైయర్ వాడుతున్నారా? ఈ చిట్కాలు పాటించకపోతే జుట్టు రాలడం ఖాయం..
ఆఫీస్ వర్క్, ఇంటిని బ్యాలెన్స్ చేయడంలో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చక్కగా రెడీ అయి వెళ్లడం పెద్ద టాస్క్‌గా మారిపోయింది
ముఖ్యంగా తల స్నానం చేసిన రోజు జుట్టు తొందరగా ఆరడం కష్టమే. అందుకే చాలా మంది అమ్మాయిలు హెయిర్ డ్రైయర్ వాడుతుంటారు.
కానీ ఇది సరైన పద్ధతిలో వినియోగించకపోతే జట్టుకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్న నిపుణులు.. కొన్ని టిప్స్ అందిస్తున్నారు.
నీళ్లు కారేంత తడిగా ఉన్న జుట్టుకు హెయిర్ డ్రైయర్ అసలు వాడొద్దు. ఇలా చేస్తే హీట్‌కు వెంట్రుకల్లో ఉన్న తేమ ఆవిరి అయిపోతుంది. కాబట్టి కాస్త జుట్టు ఆరిపోయాకే యూజ్ చేయాలి.
తలస్నానం చేసిన వెంటనే తలకు మెత్తని టవల్ చుట్టుకోవాలి. మైక్రో ఫైబర్ టవల్ వాడటం ఉత్తమం. కాగా దీంతో డ్రైయర్ వాడాల్సిన అవసరం ఉండదు.
ఒకేసారి జుట్టు మొత్తానికి డ్రైయర్ గాలి పెట్టుకుంటూ పోతే ఆరిన జుట్టు మీద తడి జుట్టు పడుతుంది. అందుకే కొంచెం కొంచెంగా జుట్టును భాగాలుగా విడదీసి డ్రై చేసుకోవాలి. దీర్ఘకాలం జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే జుట్టుకు తప్పకుండా హీట్ ప్రొటెక్టెంట్ వాడాలి.
ఇన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే తగిన దినచర్య ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.